లవ్లీ పార్ట్నర్ దొరికింది...జోడీ అదిరింది!
on Mar 27, 2024
బుల్లితెరపై సీరియల్స్, రియాల్టీ షోస్ తో మానస్ నాగులపల్లి మంచి పేరు తెచ్చుకున్నాడు. మానస్ డ్యాన్స్‌కు ఫిదా కానీ వాళ్ళు ఎవరూ ఉండరు. మానస్, విష్ణుప్రియ కలిసి చేసిన గంగులు, జరీ జరీ పంచెకట్టు అనే ఫోక్ ఆల్బమ్స్ ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలుసు. మరి ఏమయ్యిందో కానీ కొంత కాలం నుంచి ఈ జోడి అసలు ఎక్కడా కనిపించడం లేదు. ఎలాంటి ఆల్బంలో కలిసి డాన్స్ చేయడం లేదు. విష్ణుప్రియ జిమ్ లో బిజీగా కనిపిస్తోంది.. మానస్ మాత్రం అటు బ్రహ్మముడి సీరియల్ లో, ఇటు నీతోనే డాన్స్ సీజన్ 2 తో బిజీగ ఉన్నాడు.
మానస్ ఫోటోని నీతోనే డాన్స్ లో చూపించేసరికి అంతా విష్ణుప్రియ ఉంటుంది అనుకున్నారు కానీ విష్ణుప్రియ ప్లేస్ లో శుభశ్రీ ఎంట్రీ ఇచ్చింది. మానస్ శుభశ్రీతో కలిసి ఉన్న డాన్స్ పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసేసరికి ఈ జోడి మీద విష్ణుప్రియ కామెంట్ వేసింది. ఐతే ఆడియన్స్ ని విష్ణుప్రియ అంటే పక్కన మానస్ అనే ఒక ముద్ర పడిపోయింది. కానీ ఇప్పుడు ఆ జోడి విడిపోయింది. ఐతే మానస్ ఈ రెండో సీజన్ గురించి చెబుతూ శుభ శ్రీతో చేసిన పర్ఫామెన్స్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. "స్టెప్ బై స్టెప్, బీట్ బై బీట్, నీతోనే డ్యాన్స్ రెండో సీజన్‌తో అందరినీ అలరించేందుకు రెడీగా ఉన్నాం.. మీ సపోర్ట్ మాకు కావాలి.. లాంచింగ్ ఎపిసోడ్ లో మా పెర్ఫార్మెన్స్ ని చూసారా ? ఐతే ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి " అని మానస్, శుభశ్రీ పోస్ట్ వేశారు. దీనిపై విష్ణుప్రియ కామెంట్ చేసింది. "లవ్లీ పార్ట్నర్ దొరికింది.. మీ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్" అని చెప్పింది. ఇక మిగతా నెటిజన్స్ అంతా కూడా జోడీ అదిరింది..మీరే కప్ కొట్టాలి అంటూ మెసేజెస్ చేస్తున్నారు. విష్ణుప్రియ ఈ మధ్య బుల్లితెర కూడా ఎక్కడా కనిపించడం లేదు.
Also Read